
Game Changer Teaser : ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, చరణ్ లకు పాన్ ఇండియా స్టార్లుగా మంచి గుర్తింపు లభించింది.
ఆ గుర్తింపు దేవర సినిమా ఎప్పుడు ఎన్టీఆర్ విషయం లో భాగా కనపడింది. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ వంతు రావడం తో అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు.
చరణ్ అప్‌కమింగ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ గురించే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మూవీ మొదలయినప్పటి నుండి ఏదో ఒక ఇబ్బంది వల్ల పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. మొత్తానికి ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి విడుదల అవుతుందనే వార్త ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. మూవీ విడుదలకు ఇంకా టైమ్ ఉన్నా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు.
దసరా సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీ ప్రకటించి ఫ్యాన్స్ కి ఒక ఊరటనిచ్చారు. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుందని కొత్త పోస్టర్‌తో విడుదల చేశారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్‌లో ఈ సినిమా పట్ల హైప్ క్రియేట్ అయ్యింది.
ఇప్పుడు దీపావళి కానుకగా టీజర్ విడుదల కానుంది అని తాజాగా ఒక కొత్త పోస్టర్‌తో ఈ టీజర్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక అప్డేట్ చెప్పడంతో ఫ్యాన్స్ ఆ టీజర్ ఎలా ఉంటుందా అని ఎవరి కథలు వాళ్ళు అల్లేసుకుంటున్నారు
గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకి ఇంకా 75 రోజులు సమయం ఉందని రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ చరణ్ మొహం కనిపించకుండా బ్యాక్ షాట్ లో పోస్ నీ చిత్ర బృందం బయటకి వదిలింది.
Also Read : బాలయ్య కోరికలు నెరవేరుతున్నాయి
ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ సినిమా లో చరణ్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడనే విషయంల తెలిసిందే. అదే ఈ పోస్టర్‌లో స్పష్టమవుతోంది. ఎంతమంది అడ్డొచ్చిన న్యాయంగా పనిచేసే ఉద్యోగిగా ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ పాత్ర ఉంటుందని ఇప్పటివరకు విడుదలయిన పోస్టర్స్‌తో చెప్పకనే చెప్పాడు దర్శక దిగ్గజం శంకర్.
పటాసులు పేలనున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించింది. సునీల్, శ్రీకాంత్ ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏస్ ఏస్ తమన్ సంగీతం సమకూర్చాడు. వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమా నీ నిర్మించారు.
Follow us on Instagram