నందమూరి నటసింహం బాలయ్య కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.. బాలయ్య ఇటీవల వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరు చూపిస్తున్నారు.. యంగ్ హీరోస్ కి సైతం సాధ్యం కానీ రికార్డ్స్ సాధిస్తూ బాలయ్య అదరగొడుతున్నారు.. టాలీవుడ్ సీనియర్ హీరోలలో అత్యధిక సక్సెస్ రేట్ బాలయ్య కే వుంది. ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు టాక్ షో హోస్ట్ గాను బాలయ్య అదరగొడుతున్నారు. అలాగే పాలిటిక్స్ లో సైతం బాలయ్య ఫుల్ బిజీగా ఉన్నారు.ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య సూపర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమాతో కలిపి బాలయ్య డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు.
దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!
ప్రస్తుతం అఖండ సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 షూటింగ్ లో బాలయ్య బిజీగా వున్నారు..అయితే బాలయ్య ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీని రిజెక్ట్ చేసారని సమాచారం.. ఆ పాన్ ఇండియా సినిమానే ‘జాట్’. సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఓ పవర్ ఫుల్ క్యారక్టర్ కోసం బాలయ్యను అనుకున్నారు. గతంలో బాలయ్యకు వీర సింహారెడ్డి వంటి మాస్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ సినిమా కావడంతో బాలయ్య ను గెస్ట్ రోల్ లో నటింపచేసేందుకు గోపీచంద్ ఎంతో ప్రయత్నించారట.. కాని బాలయ్య మాత్రం ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించారని సమాచారం…
ఇటీవల రిలీజ్ అయిన జాట్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో అకట్టుకుంది.అయితే బాలయ్య కనుక ఆ పాత్ర చేస్తే బాగుండేది అని బాలయ్య కు పాన్ ఇండియా రేంజ్ రీచ్ వస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. కానీ అది చిన్న పాత్ర కావడంతో బాలయ్య తిరస్కరించారని తెలుస్తుంది..అఖండ సీక్వెల్ భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో తెర కెక్కుతుంది.. ప్రస్తుతం బాలయ్య తన ఫోకస్ అంతా ఈ సినిమాపైనే ఉంచారు..