ఆర్ఆర్ఆర్ అనే సినిమా తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జోరుగా సినిమాలు చేస్తున్నాడు.. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.దీంతో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ కూడా మేకర్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”వార్ 2”.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు.
SSMB : బిగ్ సర్ప్రైజ్.. మహేష్ మూవీలో ఆ స్టార్ హీరో కన్ఫర్మ్..!!
ఈ సినిమాకి సంబంధించి షూట్ కూడా పూర్తికావచ్చింది. మరో పక్క ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇటీవల షూటింగ్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్..ప్రస్తుతానికి ఎన్టీఆర్ లేని సీన్స్ షూటింగ్ చేస్తున్నారు..ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ షూట్ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో పాటుగా నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అని సమాచారం… ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్ కూడా లాక్ అయింది. ఈ మేరకు ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది.అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పిన కథ కూడా ఎన్టీఆర్ కి బాగా నచ్చడంతో దాదాపుగా ఒకే సమయంలో ఈ రెండు సినిమాలు షూటింగ్ చేయడానికి చూస్తున్నట్లు సమాచారం..