MOVIE NEWS

ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గనున్నాడా..?

మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రశాంత్ ఎన్టీఆర్‌తో చేసే సినిమా బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కుతుంది. ఈ బిగ్గెస్ట్ కాంబో నుంచి సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి లుక్, కథ గురించి ఫ్యాన్స్ లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్, బడ్జెట్ విషయాలను గమనిస్తే, ఇది మామూలు సినిమా కాదని తెలుస్తుంది.మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.వారు ఈ సినిమా కోసం ఏకంగా 350 నుంచి 400 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ “డ్రాగన్” పై ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!!

యాక్షన్ సీన్స్,విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ నార్త్ ఈస్ట్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని తెలుస్తుంది.ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుందని సమాచారం..

గతంలో ఎన్నడూ చేయని పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు.. ఈ సినిమాతో ఎన్టీఆర్ లో వున్న మరో కోణాన్ని ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు చూపించనున్నాడు… ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ మూవీ గా నిలుస్తుంది అని సమాచారం.ఈ సినిమాలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ ఏకంగా 14 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. గతంలో కాకుండా ఎన్టీఆర్ తన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని కంప్లీట్ డైట్ ఫాలో అవుతున్నట్లు సమాచారం…

 

Related posts

దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

murali

చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా

filmybowl

మావయ్య నాగబాబుని కలిసిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్..!!

murali

Leave a Comment