న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. నాని కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వున్నాయి..మినిమం గ్యారెంటీ హీరోగా నాని క్రేజ్ తెచ్చుకున్నాడు.. వైవిద్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని నాని అందిస్తున్నాడు.. ఇటీవల ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస హిట్స్‌తో నాని తన రేంజ్‌ను మరింత పెంచుకున్నాడు.ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు రాబట్టాయి..ఇప్పటివరకు 100 కోట్ల క్లబ్‌ను టచ్ చేసిన నాని, ఇప్పుడు తన టార్గెట్‌ను నేరుగా 200 కోట్లకు పెట్టుకున్నాడు.పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా తగిలితే ఈ లెక్క మరింత పెరగే అవకాశం కూడా ఉంది.ప్రస్తుతం నాని ఎక్కువగా విభిన్నమైన కాన్సెప్ట్‌లని ఎంచుకుంటున్నాడు.. కొత్త దర్శకులకి ఛాన్స్ ఇస్తూ సరికొత్త కంటెంట్ ని ప్రేక్షకులకి అందిస్తున్నాడు.. అయితే నాని ప్రస్తుతం తన రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు.
హరీష్ కథకు ఓకే చెప్పిన బాలయ్య.. బంపర్ ఆఫర్ కొట్టేసాడుగా..?
ప్రస్తుతం నాని ‘హిట్ 3’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని సమాచారం. ఈ సినిమా ద్వారా నాని పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నాని లైనప్‌లో మరో బిగ్ ప్రాజెక్ట్ ఉంది. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో నాని ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.గతంలో నాని యువ దర్శకుడు సుజిత్‌తో కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడు. పవన్ కళ్యాణ్‌తో ‘OG’ పూర్తయిన తర్వాత సుజిత్ నాని కోసం ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రిపేర్ చేశాడట. కానీ బడ్జెట్ సమస్యల వల్ల ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడినట్లు సమాచారం.సుజిత్ చెప్పిన కాన్సెప్ట్ నానికి ఎంతగానో నచ్చిందట. అందుకే ఎలాగైనా ఆ సినిమా చేయాలని నాని ఎంతో ఇంట్రెస్ట్ చూపించాడని సమాచారం. కానీ చివరికి బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్టవ్వడం లేదు.
ఇప్పుడు నాని లైనప్‌లో క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎంట్రీ ఇచ్చారు. శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని నాని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. రీసెంట్ గా ఆయన చెప్పిన స్టోరీ నానికి నచ్చింది… ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో ‘కుబేర’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా పూర్తయిన తర్వాత శేఖర్ కమ్ముల నాని సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది…