MOVIE NEWS

కల్కి సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన “కల్కి ఏడీ 2898 “మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమా దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. కల్కి సినిమాకి సీక్వెల్ గా రెండో పార్టు ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.కానీ సెకండ్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా నాగ్ అశ్విన్ మొదటి సూపర్ హిట్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా నాగ్ అశ్విన్ స్పెషల్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

రాజాసాబ్ : ఆ పాటలన్నీ చెత్త బుట్టలో వేసా.. తమన్ షాకింగ్ కామెంట్స్..!!

ఇందులో ఆయనకు కల్కి మూవీ రెండో పార్టు గురించే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా దీనిపై కొంత తడబాటుకు  గురయ్యారు… ఎందుకంటే సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఆయన దగ్గర కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు.మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగింది..రెండో పార్టులో కర్ణుడిని ఎక్కువగా చూపిస్తారా లేదంటే అర్జునుడినా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అందుకే పాత్రల ప్రాధాన్యత పెంచేందుకు కీలక మార్పులు చేస్తున్నామని నాగ్ అశ్విన్ తెలిపారు…

ఈ ఏడాది చివర్లో కల్కి సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ రెండు సినిమాలు పూర్తి కావడానికి ఈ ఏడాది సమయం పడుతుంది. ఆ సినిమాల తరువాతే కల్కి సెకండ్ పార్ట్ మొదలయ్యే ఛాన్స్ వుంది..

 

Related posts

సూపర్ స్టార్ ధనుష్ #D52 మూవీ టైటిల్ ‘ఇడ్లీ కడై’

filmybowl

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

OG : పవర్ స్టార్ సినిమాలో గ్లోబల్ స్టార్ ఇది కదా మాస్ కాంబినేషన్..?

murali

Leave a Comment