దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది..జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని డివివీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివీవీ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది…అంతేకాదు ఈ చిత్రం ఏకంగా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది.ఈ మూవీలోని నాటు నాటు అనే పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. దీంతో ఆస్కార్ వేదికగా నాటు నాటు సాంగ్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది..
VD 12 : విజయ్ సినిమాకు తారక్ వాయిస్ ఓవర్.. ఫ్యాన్స్ కి పండగే..!!
ఈ పాటను రాసినందుకు రచయిత చంద్రబోస్ కు స్వరపరిచినందుకు కీరవాణికి ఆస్కార్ అవార్డ్ లభించింది..నాటు నాటు సాంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు… అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా నాటు నాటు స్టెప్పులే వైరల్ అయ్యేవి..అంతలా నాటు నాటు పాటకు ఆదరణ దక్కింది.తాజాగా ఈ పాటను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్(ఫిఫా) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ముగ్గురు ఫుట్ బాల్ దిగ్గజాల పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఆ పోస్టర్‌లో ఫుట్‌బాల్ దిగ్గజాలు నేయ్‌మార్, టెవెజ్, రొనాల్డో ఫోటోలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా క్రియేట్ చేసింది. వీరి పేర్లలోని తొలి అక్షరాలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా పోస్టర్‌ను రూపొందించారు.
ఇందులో ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ స్టెప్పులు వేస్తున్నట్లు కనిపించారు. ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ టీం రియాక్ట్ అయ్యారు. ముగ్గురు ఫుట్ బాల్ దిగ్గజాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు..ఈ పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..