MOVIE NEWS

నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..?

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ “తండేల్”.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి పాన్ ఇండియా దర్శకుడైన చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొంత కాలంగా మంచి సక్సెస్ లేని నాగచైతన్య ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

నిజజీవితంలో జరిగిన ఒక యదార్ధ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది..శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పడుతున్న కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బందికి చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వస్తుంది.ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడటంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి బయటకు ఎలా వచ్చారు అనేది ఈ సినిమా కథ.. సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి మధ్య వచ్చే ఎమోషనల్ లవ్ సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని మేకర్స్ ధీమాగా వున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి బుజ్జి తల్లి అనే లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది..

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కాకముందే నాగచైతన్య తన తర్వాత ప్రాజెక్ట్ లపై పూర్తి ఫోకస్ చేశారు. కార్తీక్ దండు డైరెక్షన్లో నాగచైతన్య తన తరువాత సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మీ సినిమా బడ్జెట్లో 120 కోటకు పైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. కేవలం విఎఫ్ఎక్స్ కోసమే 30 కోట్ల ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి..ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రొరంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

Related posts

నా వల్లే షూటింగ్ 3 నెలలు లేట్ అయింది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!!

murali

తెలుగు సినిమా అభిమానుల మధ్య మళ్ళి రాజేసుకున్న కలెక్షన్స్ కుంపటి.

filmybowl

గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

Leave a Comment