MOVIE NEWS

రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దర్శకుడిగా సుకుమార్ కి, హీరోగా అల్లుఅర్జున్ కి మొదటి సూపర్ హిట్ “ఆర్య”.. ఆ రోజుల్లో ఆర్య సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించింది.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది..ఆర్య సినిమా తో సుకుమార్, అల్లు అర్జున్ కెరీర్ ఒక్కసారిగా చేంజ్ అయింది..

రాంచరణ్ ‘పెద్ది’ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది..!!

ఈ సినిమా తరువాత అల్లుఅర్జున్ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు.. అలాగే సుకుమార్ కూడా తన స్టైల్ ఆఫ్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ “ ఆర్య 2”..అల్లు అర్జున్, కాజల్, నవదీప్ మెయిన్ లీడ్స్ గా ఆర్య సినిమాకు సీక్వెల్ గా మరోసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఆర్య 2 సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు.. అయితే గత కొంతకాలంగా వింటేజ్ మూవీస్ ప్రతివారం ఏదో ఒకటి రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి.

ఒకప్పటి హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు అన్నీ రీ రిలీజ్ అవుతున్నాయి.ఇప్పుడు ఈ లిస్ట్ లో ఆర్య 2 సినిమా చేరింది. పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టి అల్లు అర్జున్ తన తరువాత సినిమా కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.. ఐకాన్ స్టార్ తన తరువాత సినిమాను అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నాడు..ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా టైం పడుతుంది.. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గతంలో అల్లు అర్జున్ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.. గతంలో దేశ ముదురు సినిమా రీ రిలీజ్ అయింది.ఇప్పుడు అల్లు అర్జున్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ఆర్య 2 రీ రిలీజ్ కాబోతుంది. నేడు ఉగాది పండగ పూట ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆర్య 2 సినిమా ఏప్రిల్ 5 శనివారం నాడు ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది

 

Related posts

ఎన్టీఆర్,నెల్సన్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్..?

murali

‘వార్‌ 2’ నుంచి ఎక్స్సైటింగ్ అప్డేట్‌….

filmybowl

సూపర్ స్టార్ మూలంగానే ఆ కథ రాసా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment