MOVIE NEWS

ఐకాన్ స్టార్ పుష్ప 2 పై రోజా మాస్ రివ్యూ అదిరిపోయిందిగా..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప ది రూల్ “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయి  బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా ఏకంగా 800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది…పుష్ప 2 సినిమాలో ఐకాన్ స్టార్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు..

RC16 : మ్యూజిక్ విషయంలో సూపర్ ట్విస్టు.. రెహమాన్ ప్లేస్ లో దేవిశ్రీ..?

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. రోజా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో పుష్ప 2 సినిమాపై ఆమె కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి..పుష్ప ది రూల్ మూవీ అద్భుతమైన సినిమా అని రోజా పేర్కొన్నారు. అల్లు అర్జున్ పుష్పతో తగ్గేదేలే అన్నారు..పుష్ప2 సినిమాతో అస్సలు తగ్గేదేలే అని అందరి చేత అనిపించారని రోజా చెప్పుకొచ్చారు.పుష్ప ది రూల్ మూవీలో చిత్తూరు యాసను వెండితెరపై  పలికిన తీరు హాల్ లో ఈలలు వేయిస్తోందని రోజా చిత్ర యూనిట్ ని మెచ్చుకున్నారు..

పుష్ప2 సినిమాలో బన్నీ నటన అద్భుతం..బన్నీ మాస్ ఇమేజ్ తో యావత్ దేశాన్ని షేక్ చేశారని రోజా కొనియాడారు. పుష్ప అంటే ఫ్లవర్ కాదని ఫైర్ అని వైల్డ్ ఫైర్ అని పూనకాలు తెప్పించారని రోజా ట్వీట్ చేసారు… మా తిరుపతి గంగమ్మ జాతర పుష్ప ది రూల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో హైలెట్ అయిందని రోజా తెలిపారు.చిత్ర యూనిట్ ఇన్నేళ్ల శ్రమకు తగ్గ ఫలితమే ఇంతటి విజయానికి నాంది అని చిత్ర యూనిట్ కు రోజా శుభాకాంక్షలు తెలిపారు

Related posts

మంగళవారం డైరెక్టర్ కే ఎందుకిలా….

filmybowl

Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

“గేమ్ ఛేంజర్” లో ఆ స్టార్ డైరెక్టర్స్.. ఏంటి మావ శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..?

murali

Leave a Comment