ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టాడు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ విజయం సాధించింది.. దీంతో “పుష్ప 2” పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి..
పుష్ప 2 : ఐకాన్ స్టార్ సినిమాకి ఆ మెగా హీరో బెస్ట్ విషెస్..
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది..రావు రమేష్,సునీల్,అనసూయ, ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అలాగే మరిన్ని కొత్త పాత్రలు ఈ సినిమాలో కనిపించనున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. పుష్ప 2 సినిమా రేపు(డిసెంబర్ 5)గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నేడు అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి.. థియేటర్స్ వద్ద ఇప్పటినుంచే ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. టికెట్స్ రేట్లు భారీగా పెంచినా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈ సినిమాకు కనుక పాజిటివ్ టాక్ వస్తే అల్లు అర్జున్ మేనియాను ఆపడం ఎవరి వల్ల కాదు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పుష్ప 2 కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ వైడ్ భారీగా పాపులర్ కావాలని చూస్తున్నాడు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సెన్సేషన్ సృష్టించిన పుష్ప సినిమా మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది.. గతంలో ఉన్న పాత రికార్డులు అన్నిటినీ పుష్ప2 సినిమా చెరిపేస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.. ఇదిలా ఉంటే “పుష్ప 2” సినిమాను అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ తో కలిసి చూసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. దీనికోసం ఆయన హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు రాత్రి 9:30 గంటలకు చేరుకుంటారని సమాచారం.. సాయంత్రంలోపు దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.