MOVIE NEWS

హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ “గుంటూరు కారం”.. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది… అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా ప్రకటించలేదు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ న్యూస్ కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు… ఎందుకంటే అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ చెప్పిన కథ అంతగా ఎక్కకపోవడంతో ప్రస్తుతానికి ప్రాజెక్టు పక్కన పెడదామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది…

“దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..?

అందుకే ఆయన స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే గుంటూరు కారం సినిమా రిలీజ్ ఏడాది పూర్తయినా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేసేందుకు దృష్టి సారించ లేదు..అల్లుఅర్జున్ తో సినిమా చేయాలనీ త్రివిక్రమ్ ఇంతకాలం ఎదురుచూసాడు.అల్లు అర్జున్ ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది..ప్రస్తుతం స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. ప్రస్తుతానికి తన భార్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాల గ్రీన్ సిగ్నల్ విషయంలో త్రివిక్రమ్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అట్లీతో సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ త్రివిక్రమ్ చూస్తున్నట్లు సమాచారం.. ఈ లోపు ఏదైనా చిన్న సినిమా తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి వుంది…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఇటు రాజకీయాలు అలాగే తాను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకుంటూ బిజీగా వున్నారు.. అవి పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.. ఈ లెక్కన పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం లేదు..

 

Related posts

ప్రభాస్ “ఫౌజీ” రిలీజ్ పై మేకర్స్ సరికొత్త స్ట్రాటెజీ..!!

murali

జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..?

murali

ఐకాన్ స్టార్ పుష్ప 2 పై రోజా మాస్ రివ్యూ అదిరిపోయిందిగా..!!

murali

Leave a Comment