MOVIE NEWS

ఈ ఒక్క సినిమాతో నా పాపాన్ని కడిగేసుకుంటా.. ఆర్జివీ సంచలన ట్వీట్ వైరల్..!!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ గతంలో తెరకెక్కించిన చాలా సినిమాలు కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయాయి.. గతంలో ఆర్జీవీ టేకింగ్ అంటే ఇష్టపడని వారు వుండరు.ఎవరికి సాధ్యం కాని విధంగా ఆర్జివీ తనదైనా శైలిలో అద్భుతంగా సినిమాలు తెరకెక్కించాడు.. అయితే ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఆర్జివీ అంటే ఏ గ్రేడ్ సినిమాలు చేసుకునే దర్శకుడు అని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం గత కొన్నేళ్లుగా ఆర్జివీ మద్యానికి బానిస అయి తనకి అనిపించిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు..తనలో వున్న అద్భుత టాలెంట్ ని పక్కన పెట్టి జీవితంలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాడు..అయితే ఆర్జీవీ తీసిన బెస్ట్ సినిమాల్లో ఒకటైన సత్య సినిమాని ఇటీవల రీ రిలీజ్ చేసారు.దీనికి ముంబైలో స్పెషల్ షో వేయడంతో ఆర్జీవీతో పాటు ఆ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ వచ్చారు.సత్య సినిమా చూసిన తర్వాత ఆర్జీవీ తన సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసారు…. సత్య సినిమా మళ్ళీ చూసి నేను ఏడ్చాను. అప్పట్లో ఉన్న నిజాయితీ, నిబద్దత ఇప్పుడు నాలో అస్సలు లేవు. ఇలాంటి మంచి సినిమాలు తీసిన నేను ఆ తరువాత అహంకారంతో ఏవేవో సినిమాలు తీసాను. సత్య సినిమా ఇప్పుడు నాలో మార్పు తెచ్చింది. ఇకపై నా జీవితాంతం మంచి సినిమాలు తీయడానికే ప్రయత్నిస్తానని ప్రామిస్ చేసారు…

ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సత్య సినిమా రేంజ్ లో కాకపోయినా నిజాయితిగా నా టాలెంట్ అంతా ఉపయోగించి ఓ మంచి సినిమా కచ్చితంగా తీస్తాను అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. ఇన్నేళ్లకు ఆర్జీవీ ఎమోషనల్ గా ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది..మళ్ళీ వింటేజ్ ఆర్జీవీ కంబ్యాక్ ఇస్తాడా? ఇస్తే ఎలాంటి సినిమా తీస్తాడు? ఆర్జీవీ నెక్స్ట్ సినిమా ఏంటి అంటూ ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. తాజాగా ఆర్జీవీ తన నెక్స్ట్ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ, ఆ సినిమా కథ మెయిన్ పాయింట్ కూడా చెప్తూ ట్వీట్ చేసాడు.ఆర్జీవీ తన ట్వీట్ లో.. ఒక మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు. సత్య సినిమాపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా నేను ఎప్పటికైనా పెద్ద సినిమాని తీయాలనినిర్ణయించుకున్నాను. ఆ సినిమా పేరు ‘సిండికేట్’. ఇది భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే ఓ భయంకరమైన సంస్థ. దీని కాన్సెప్ట్ ఏంటంటే.. స్ట్రీట్ గ్యాంగ్‌లు, రాజకీయ పార్టీలు, స్మగ్లింగ్లు, కార్పొరేట్ ముఠాలు, D కంపెనీ.. ఇలాంటివి దేశంలోని ఆర్ధిక సంస్కరణలు తీవ్రంగా నాశనం చేసాయి. ఆ తర్వాత భయంకరమైన ISIS, ఘోరమైన అల్ఖైదాతో ఉగ్రవాదం కూడా పెరిగింది.

కానీ గత 10 నుండి 15 సంవత్సరాల మధ్యలో భారతదేశంలో చెప్పుకోదగ్గ నేర సంస్థ ఏదీ కూడా లేదు. ప్రస్తుతం వివిధ దేశాల మధ్య ఉన్న గొడవలతో ఓ కొత్త రకమైన నేర సంస్థ పుట్టే సమయం ఆసన్నమైందని. ఇది గతంలోని సంస్థలకు భిన్నంగా పోలీసింగ్ ఏజెన్సీలు, రాజకీయాలు, రిచ్ బిజినెస్ మెన్స్, మిలిటరీతో సహా పలువురు కలిసి ఒక సిండికేట్‌గా మారింది. సిండికేట్ అనేది ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు. అంటూ ఆర్జివీ ట్వీట్ చేసారు..ఈ సిండికేట్ అనే ఈ ఒక్క సినిమాతో గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన పాపాలన్నింటినీ కడిగేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. ఈ సినిమా క్యాస్ట్,మిగిలిన డీటెయిల్స్ త్వరలోనే ప్రకటిస్తానని ఆర్జివీ తెలిపారు.

Related posts

రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!!

murali

గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..?

murali

“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!!

murali

Leave a Comment