MOVIE NEWS

‘సినిమాలు తీయడం మానేస్తా’.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..!!

‘పుష్ప 2’ సినిమా సంచలన విజయం సాధించినా కూడా పుష్ప టీం లో ఏ మాత్రం సంతోషం లేదు.. సంధ్య థియేటర్ ఘటన అల్లుఅర్జున్ ని మానసికంగా దెబ్బతీసింది.. ఇన్నేళ్లు ఎంతో కష్టపడి తెచ్చుకున్న క్రేజ్ ఒక్కసారిగా పోయింది.ప్రీమియర్ సందర్భంగా అల్లుఅర్జున్ రాకతో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం ఈ ఘటనతో అల్లుఅర్జున్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ మానసిక క్షోభకి గురవుతున్నారు..ఈ ఘటన తర్వాత  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బన్నీపై పరోక్షంగా విమర్శలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది..

ఈ ఘటన అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ పై కూడా తీవ్ర ప్రభావం చూపింది.. ఆయన మాత్రం ఈ ఘటన వల్ల మానసికంగా కృంగిపోయాడని అర్థమవుతుంది. ‘పుష్ప 2’ సక్సెస్ మీట్ లో కూడా ఆయన మహిళ మృతి గురించి మాట్లాడుతూ ఎంతో బాధను వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే తాజాగా తాను ఏకంగా సినిమాలని వదిలేస్తా అంటూ సంచలన ప్రకటన చేశారు.. ఈ ప్రకటనతో అందరూ షాక్ అవుతున్నారు.రీసెంట్ గా అమెరికాలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్లో సుకుమార్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో సినిమాలోని ‘ధోప్’ అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో, యాంకర్ సుమ దర్శకుడు సుకుమార్ ను..’ మీరు ఒకవేళ ‘ధోప్’ ‘ (వదిలిపెట్టడం అని అర్థం) అని వదిలేయాలి అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు అని అడిగగా..సుక్కు ఏకంగా ‘సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా’ అని చెప్పి షాక్ ఇచ్చాడు..దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ ఒక్కసారిగా షాకయ్యాడు.సుకుమార్ దగ్గర మైక్ లాక్కొని ‘అలా అస్సలు చేయరులేండి అని అన్నారు..ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల మీడియా లో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తన ఫ్రండ్ అల్లుఅర్జున్ ఎదుర్కుంటున్న సిట్యుయేషన్స్ సుకుమార్ ని బాగా డిస్టర్బ్ చేసాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Related posts

భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..?

murali

ఎస్ఎస్ఎంబి : రెండు పార్టులుగా మహేష్ సినిమా..రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!

murali

3D వెర్షన్ లో రిలీజ్ అయిన పుష్ప2. ఎక్కడో తెలుసా..?

murali

Leave a Comment