ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.. పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్స్ నిర్వహిస్తున్నారు.మొన్న చెన్నై, నిన్న కొచ్చి, నేడు ముంబై ఇలా వరుసగా భారీ ఈవెంట్స్ తో పుష్ప పై భారీగా హైప్ క్రియేట్ చేస్తున్నారు..ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లుఅర్జున్ ముంబైలో సందడి చేశారు. ఆ ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!!
ఈ కార్యక్రమంలో భాగంగా దేవిశ్రీప్రసాద్ గురించి ప్రస్తావన కూడా వచ్చింది.ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్ తో తాను సరదాగా మాట్లాడుతున్నప్పుడు తను నువ్వు ఎందుకు బాలీవుడ్ సినిమాలు చేయడం లేదని ప్రశ్నించాడు… అప్పుడు దేవిశ్రీ నాతో ఒకటే మాట చెప్పాడు..నువ్వు వెళ్లి బాలీవుడ్ సినిమాలు చెయ్యి.నీ సినిమాకు నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తానని చెప్పారు.. అయితే తనకు బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చే ఆసక్తి లేదని అల్లు అర్జున్ తెలిపారు. తాజా పరిస్థితుల దృష్ట్యా బాలీవుడ్ లో కొనసాగడం కష్టమని అందుకే తాను బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయను అంటూ అల్లు అర్జున్ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.
ప్రస్తుతం అల్లుఅర్జున్ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.పాన్ ఇండియా స్థాయిలో అద్భుతంగా రానిస్తున్న ప్రభాస్,రామ్ చరణ్,ఎన్టీఆర్ వంటి స్టార్స్ అందరూ కూడా హిందీ సినిమాలు చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తాను హిందీ సినిమాలు చేయనని చెప్పడంతో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు.. అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమాకు నార్త్ లో ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీనితో నార్త్ లో అల్లుఅర్జున్ సినిమా చేస్తే ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశం వుంది.