MOVIE NEWS

ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “..స్టార్ డైరెక్టర్ బాబీ తెరక్కెక్కించిన ఈ క్రేజీ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, చాందిని కీలక పాత్రలలో నటించారు.. వాల్తేర్ వీరయ్యతో చిరంజీవికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన బాబీ బాలయ్యతో మరో బిగ్గెస్ట్ మాస్ మూవీని తెరకెక్కించాడు.. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లిట్ చేసుకున్న డాకు మహారాజ్ జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎప్పుడు చూడని విధంగా ఉండనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు..

3D వెర్షన్ లో రిలీజ్ అయిన పుష్ప2. ఎక్కడో తెలుసా..?

ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన రెండు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.అందులో భాగంగానే చిత్ర దర్శకుడు బాబీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

బాబీ మాట్లాడుతూ ‘ నా కెరీర్ లో ఓ సినిమా విషయంలో ఎంతో బాధపడ్డాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ నిర్మాణ సంస్థ నేను అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు..ఇచ్చి ఉంటే కనుక ఆ సినిమా ఇంకా బాగా తీసి ఉండేవాడిని. నేను ఎంత అడిగినా కూడా బడ్జెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో చాలా బాధేసింది’ అని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు బాబీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. బాబీ ఏ సినిమాపై ఈ వ్యాఖ్యలు చేసారా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఈ కామెంట్స్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపైనే చేసాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే..కాదు జై లవకుశ పై అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ కాబట్టి దర్శకుడు బాబీ జై లవకుశ మేకర్స్ నుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

Related posts

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కి భారీ ఊరట..టికెట్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ఆరు సినిమాలు అప్డేట్స్ తో రెడీ !

filmybowl

విశ్వంబర ఎప్పటికి పూర్తయ్యెను ??

filmybowl

Leave a Comment