టాలీవుడ్ పాపులర్ స్టోరీ రైటర్ కోన వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించి ఆయన స్టార్ స్టోరీ రైటర్ గా ఎదిగారు.. ఎంతో మంది స్టార్ సినిమాలకు కోన వెంకట్ స్టోరీ రైటర్ గా వర్క్ చేసారు..స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, కోన వెంకట్ కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.. శ్రీను వైట్ల సినిమా అంటే కచ్చితంగా కోన రైటింగ్ ఉండాల్సిందే.. కానీ వారి మధ్య కొన్ని వివాదాలు రావడంతో కోన వెంకట్ శ్రీను వైట్ల సినిమాకు రైటర్ గా పని చేయడం మానేశారు..అయితే చివరిగా కోన వెంకట్ అంజలితో గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాకు కథ అందించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
మరో అరుదైన ఘనత సాధించిన వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం”..!!
ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కోన వెంకట్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు.. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బాద్షా సినిమా సమయంలో తాను రైటర్గా డిసప్పాయింట్ కాలేదని చెప్పుకొచ్చారు. బాద్షా సినిమా కచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మెమరబుల్ ఫిలిం. అందులో ఉన్న పాటలు అలాగే బ్రహ్మానందం గారి కామెడీ ట్రాక్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని కోన వెంకట్ అన్నారు.. రైటర్ గా నాకు బాద్షా పేరు తీసుకొచ్చిన సినిమా అని కోన వెంకట్ తెలిపారు… అయితే రాంచరణ్ తో చేసిన బ్రూస్ లీ సినిమా డిసప్పాయింట్ చేసిందని అన్నారు. బ్రూస్ లీ సినిమా అంతగా వర్కౌట్ కాలేదని అన్నారు.
శ్రీను వైట్లతో విభేదాల తరువాత నన్ను, ఆయన్ని చరణే మళ్ళీ కలిపాడు, నిజానికి అప్పటికి గాయం పచ్చిపచ్చిగా ఉంది ఇంకా గాయం అప్పటికి మానలేదు. ఆ పచ్చిగా ఉండటం వల్ల బలవంతపు వ్యవహారాల మీద ఆ సినిమా నడిచింది. అయితే ఇప్పుడంతా సద్దుమణిగింది అని ఆయన అన్నారు. అది కూడా వర్కౌట్ అయి ఉంటే గోపి మోహన్, నాకు, శ్రీనుకి ఇండస్ట్రీకి తిరుగులేని ఆధిపత్యం వచ్చేది. కానీ ఆ దేవుడు అలా డిజైన్ చేయలేదేమో అని కోన వెంకట్ తెలిపారు..