టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన అందం అభినయంతో ఎంతో ఆకట్టుకుంది.. సవ్య సాచి కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు.. ఆ తరువాత అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది.. కానీ పూరి జగన్నాధ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఈ అమ్మడికి మంచి బ్రేక్ ఇచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి ఏకంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది.. కానీ ఈ అమ్మడికి అదృష్టం లేకపోవడంతో ఆ సినిమాల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది..
Rajamouli : దర్శక దిగ్గజానికి ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా..?
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడంతో హరిహర వీరమల్లు షూటింగ్ కి బ్రేక్ పడింది.. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ కూడా మొదలై చాలా కాలమే అయింది.. ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూటింగ్ పవన్ కళ్యాణ్ పూర్తి చేయడంతో ఈ మూవీ జులై 24న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తోంది.అయితే ఈ సినిమా మొదలై ఐదేళ్లు అవుతోంది. ఇన్నేళ్లుగా మూవీ వాయిదాలు పడుతూనే వచ్చింది. ఇన్నేళ్లు పడుతుందనే విషయం నిధి అగర్వాల్ కు అప్పుడు తెలియదు. అందుకే మూవీకి ఒప్పుకుంది. కానీ అనుకోకుండా మూవీ షూటింగ్ కు ఇన్నేళ్లు పట్టింది.
అయితే ఈ ఐదేళ్లు నిధి వేరే సినిమాలు కూడా పెద్దగా చేయలేదు. ఎందుకంటే అందుకు నిధి చేసుకున్న వీరమల్లు అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమా అయిపోయేదాకా వేరే మూవీలు ఒప్పుకోవడానికి వీళ్లేదు.మరి ఈ ఐదేళ్లు ఫైనాన్షియల్ గా ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిధి ఆన్సర్ ఇచ్చింది. ప్రతి నెల నాకు ఒక్క షాప్ ఓపెనింగ్ అయినా వచ్చేది. దాంతో పాటు యాడ్ ప్రమోషన్లు కూడా బాగానే వచ్చాయి. అందుకే వాటితో మేనేజ్ చేస్తూ వచ్చాను.. ఇన్నేళ్లు ఆలస్యం అయినా ఓ మంచి పాత్రతో వస్తున్నాను అనే మంచి ఫీల్ అయితే ఉందని నిధి తెలిపింది..
