MOVIE NEWS

హామీ ఇస్తున్నా.. అస్సలు నిరాశ పరచను.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్ జే సూర్య సునీల్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.“గేమ్ ఛేంజర్” మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

డాకు మహారాజ్ : సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!

గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యం లో మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు..అందులో భాగంగా మేకర్స్ అమెరికా లోని డల్లాస్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసారు.. ఆ ఈవెంట్ లో రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.. చరణ్ మాట్లాడుతూ “సంక్రాంతి నాకు, రాజు గారికి చాలా స్పెషల్.. దాదాపు 2 వేల రోజుల తర్వాత నా సోలో సినిమా విడుదలవుతుంది. నాలుగేళ్లు తర్వాత వస్తున్నా.. చివరగా ఆర్ఆర్ఆర్ తో మీ ముందుకు వచ్చా” అని తెలిపారు.

“అప్పుడు నా బ్రదర్ తారక్ తో కలిసి యాక్ట్ చేశా.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డా.. శంకర్ గారి స్టైల్ ను సంక్రాంతికి చూడబోతున్నాం. ఫ్యాన్స్ ను నేను ఎప్పుడూ నిరాశపరచను” అంటూ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు… ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది…ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ పోషించారు. హై యాక్షన్ సీన్స్ తో బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామాగా గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కింది..

Related posts

వీరమల్లు కాదనుకుంటే విశ్వంభర రెడీ

filmybowl

స్పిరిట్…. యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ తోనే

filmybowl

గుంటూరు కారం నీ అదే దెబ్బేసింది కానీ, దేవరకు అది ప్లస్ అయింది

filmybowl

Leave a Comment