టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి ఒక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా అద్భుతంగా రానిస్తున్నారు..దిల్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన దిల్ రాజు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నిర్మాత శిరీష్ తో కలిసి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మిస్తూ వచ్చారు.. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.. గతంలో నిర్మాత అంటే కేవలం సినిమాకు డబ్బులు పెట్టె వ్యక్తి మాత్రమే అని అంతా భావించేవారు.. కానీ దిల్ రాజు నిర్మాతల వ్యవహార శైలినే మార్చేసారు..
ఆ స్టార్ హీరోని లైన్లో పెట్టిన పూరీ జగన్నాథ్..అస్సలు ఊహించలేదుగా..?
ఒక కథను సినిమాగా తీసే ముందు ఆ కథ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని ఒకటి కి రెండు సార్లు చెక్ చేసుకొని సినిమా ఓకే అయితే సినిమాను తెర కెక్కించడంలో దర్శకుడు కి దిల్ రాజు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు.. తన కెరీర్ లో దిల్ రాజు సుకుమార్, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దర్శకులుగా పరిచయం చేసారు.. అయితే దిల్ రాజు సక్సెస్ వెనుక ఆయన సతీమణి శ్రీమతి అనిత గారు వున్నారు.. ఆయన కు తన భార్య అనిత గారు అంటే ఎంతో ప్రేమ.. అందుకే ఆయన ప్రతీ సినిమా ప్రారంభం లో శ్రీమతి అనిత సమర్పించు అని వస్తుంది..అనిత, దిల్ రాజు దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.. వారికి హన్సిత అనే కూతురు కూడా వున్నారు..హన్సితకు 2014 మే 2 దిల్ రాజు దంపతులు వివాహం చేసారు..ఇప్పుడు హన్సిత కు ఒక పాప, బాబు వున్నారు..
అయితే దిల్ రాజు భార్య అనిత గారు 2017 న గుండెపోటు తో మరణించారు..అనిత గారి మరణంతో కృంగి పోతున్న దిల్ రాజుకి ఆయన కుమార్తె హన్సిత మళ్ళీ వివాహం జరిపించారు..అలా దిల్ రాజుకు తేజస్విని అనే బ్రాహ్మణ అమ్మాయితో రెండో వివాహం జరిగింది..ఈ దంపతులకు ఓ బాబు కూడా వున్నాడు.. ఇదిలా ఉంటే తేజస్విని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.. తన డైలీ లైఫ్, అలాగే బ్యూటీ సీక్రెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు….తన ఫుడ్ హ్యా బిట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.. డైలీ వర్కౌట్స్ ఫినిష్ చేసి ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకుంటానని తెలిపారు.. అలాగే జుట్టు సమస్య రాకుండా ఉండటానికి హెయిర్ కేరింగ్ ఎక్కువ తీసుకోవాలని హెల్త్ ఫుడ్ తీసుకోవాలని ఆమె తెలిపారు.. ఆయిల్ అప్లై చేయడం వంటివి సజెస్ట్ చేసారు..డైలీ రొటీన్ లో భాగంగా వర్క్ ఫినిష్ చేసుకొని తన కొడుకుని చూసుకుంటూ సార్ తో టైం స్పెండ్ చేస్తూ ఉంటానని ఆమె అన్నారు..తన కొడుకు పేరు శ్రీ అన్వయ్ అని తనకి 2.9 ఇయర్స్ అని తేజస్విని తెలిపారు..