MOVIE NEWS

నేను ఏ తప్పు చేయలేదు..అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన బజ్ ఏర్పడింది..ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు దాదాపు 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి..అయితే ఈ మూవీ రిలీజ్ కు ఒక్కరోజు ముందు మేకర్స్ ప్రీమియర్స్ వేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లారు.

ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ అభిమానులను తోసెయ్యడంతో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఓ బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ చాలా సీరియస్ అయ్యింది. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది..అల్లు అర్జున్ ను అరెస్ట్ కూడా చేయడం  ఆయన బెయిల్ పై బయటకు రావడం అంతా చక చక జరిగింది..తాజాగా అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన పై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనపై ఫాల్స్ అలిగేషన్స్ చేయడంతో అల్లు అర్జున్ తాజాగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు..

టికెట్ రేట్స్ హైక్ లేదు.. బెన్ఫిట్ షో పడేది లేదు..మరి “గేమ్ ఛేంజర్” పరిస్థితి ఏంటి..?

“జరిగిన ఘటన ఒక ప్రమాదం.. ఇందులో ఎవరి తప్పు లేదు. హాస్పటల్ లో ఉన్న బాబు త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను.. ఆ ఫ్యామిలీకి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాని అల్లుఅర్జున్ తెలిపారు… నాకు థియేటర్ ఓ టెంపుల్ లాంటిది. అభిమానులకు ఏదైనా అయితే నేను అసలు తట్టుకోలేను… బయట చేస్తుందంతా అసత్య ప్రచారం. ఈ ఘటన జరగడంతో పుష్ప 2 సినిమా సూపర్ హిట్ అయినా కూడా నేను ఇంట్లో ఒక్కడినే కూర్చొని 15 రోజుల నుంచి బాధపడుతున్నాను.నేను కానీ థియేటర్ యాజమాన్యం కానీ ఎవరు కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు.. ఆ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా.. ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని అల్లుఅర్జున్ హామీ ఇచ్చారు..

Related posts

ఎస్ఎస్ఎంబి : రెండు పార్టులుగా మహేష్ సినిమా..రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!

murali

గేమ్ ఛేంజర్ : తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

murali

పుష్ప 2 : సెన్సార్ కత్తెరించిన సన్నివేశాలు ఏమిటో తెలుసా ..?

murali

Leave a Comment