MOVIE NEWS

నేను కాపీ చేసే రకం కాదు.. దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది..ఏకంగా ఆర్ఆర్ఆర్ కు మించి కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకుపోతున్న పుష్ప 2 ది రూల్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంలో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర ఎక్కువనే చెప్పాలి..ఈ సినిమాలో ఉన్నవి నాలుగు పాటలే అయినా కూడా మాస్ కి కిక్కిచ్చేలా కంపోజ్ చేయడంలో దేవిశ్రీ మరోసారి విజయం సాధించాడు..

పుష్ప 2 ఆల్బమ్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది…అయితే బిజిఏం విషయంలో మరో ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసారు.. దీనిలో ఎవరికి ఎంత క్రెడిట్ అనేది పక్కన పెడితే ఒరిజినల్ స్కోర్ పరంగా దేవి పేరే ఉండటం ఫ్యాన్స్ ని సంతోషపరిచింది. మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సిఎస్ అదనపు విభాగంలో ఉన్నారు. తాజాగా దేవిశ్రీ ఆసక్తికర విషయాలు తెలియజేశారు..కిస్సిక్ పాట అనుకున్నప్పుడు ముందు నా వద్ద ఎలాంటి ట్యూన్ లేదు. స్టోరీ ప్రకారం కేవలం కిస్సిక్ అనే పదం మాత్రమే దర్శకుడు సుకుమార్ దేవికి చెప్పారట.

పుష్ప 2 : సినిమాలో ఆ సీన్స్ లేపేసిన సుకుమార్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!

ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అలాగే స్నేహితులను కలుసుకున్నప్పుడు ఫోటోలు దిగడం చాలా సహజం అప్పుడు కెమెరా నుంచి వచ్చే కిస్సిక్ శబ్దాన్ని రిథమ్ గా మార్చి చంద్రబోస్ సహాయంతో ట్యూన్ చేసినట్లు దేవి తెలిపారు… మంచి మాస్ సాంగ్ ఒకటి పడాలన్నా ఉద్దేశంతో పీలింగ్స్ ని కంపోజ్ చేశామని , దానికి ముందు మలయాళం లిరిక్స్ ని పొందుపరిచి దానికో మెలోడీ టచ్ ఇచ్చినట్లు దేవిశ్రీ చెప్పుకొచ్చారు.

అయితే ఇతర సినిమా పాటలను కాపీ కొట్టేసి స్ఫూర్తి చెందానని చెప్పుకోవడానికి తాను పూర్తి విరుద్ధమని దేవిశ్రీ తెలిపారు..ఎవరైనా ఇంగ్లీష్ లేదా ఇతర బాషల సిడిలు ఇచ్చి పాటలు చేయమంటే దానికి నేను అస్సలు ఒప్పుకునేవాడిని కాదని స్వంతంగా తయారు చేయడమే తన సిద్ధాంతమని దేవిశ్రీ తెలిపాడు..తాను అవకాశం రాబట్టుకోవడాన్ని ఒప్పుకుంటాను కానీ వేరొకరి అవకాశాన్ని తీసుకోవడం మాత్రం తప్పని చెబుతానని డిఎస్పి తెలిపారు

Related posts

RC16 : చరణ్ సినిమా గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన రత్నవేలు..!!

murali

పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..?

murali

బన్నికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. కానీ..?

murali

Leave a Comment