సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి… లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో అద్భుత విజయాలను అందుకుంటున్నారు..ఈ ప్రతిష్టాత్మక సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ ఎంతో గ్రాండ్ గా నిర్మించింది..కూలీ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులు భారీ ధరకు సొంతం చేసుకుంది.
ఆ పుస్తకంతో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మూవీ కోసమేనా..?
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలన్నీ గతంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన నేపథ్యంలో కూలీ సినిమా రైట్స్ కోసం గట్టి పోటీ ఏర్పడింది. రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేస్తుంది.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ క్రేజ్ తీసుకొచ్చాయి.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మాస్ సాంగ్ ‘చికిటు’ నెట్టింట అదరగొడుతుంది.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఆనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ పాట నెట్టింట ట్రెండింగా నిలిచింది…కూలీ మూవీ 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగు డిస్ట్రిబ్యూషన్ ఫిక్స్ కావడంతో త్వరలోనే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు కానున్నాయి..జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన తలైవా ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి..
