MOVIE NEWS

ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!!

పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ కి ఆ సినిమా రిలీజ్ రోజు నుంచి అస్సలు మనస్శాంతి లేదు.. ఫ్యాన్స్ తో సినిమా ఎంజాయ్ చేయాలనీ సంధ్య థియేటర్ కి వెళ్లిన అల్లుఅర్జున్ ని తొక్కిసలాట ఘటన చిక్కుల్లో పడేసింది.. అసలు ఆరోజు సినిమాకు వెళ్ళకపోయివుంటే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ని ఫ్యాన్స్ తో బాగా ఎంజాయ్ చేసేవాడు.. కానీ ఆ ఘటన అల్లుఅర్జున్ జీవితంలో మాయని మచ్చలా నిలిచింది..

శ్రీ తేజ్ ని పరామర్శించా..కానీ పబ్లిసిటీ చేసుకోలేదు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్..!!

ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా వున్నారు.. అల్లుఅర్జున్ చేసింది తప్పు అంటూ ఏకంగా అసెంబ్లీలోనే దుయ్యబట్టారు.. అల్లుఅర్జున్ ని సపోర్ట్ చేసినందుకు సినిమా స్టార్స్ పై కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు..రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది.. అల్లుఅర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతూ ఈ ఇష్యూ ని మరింత సీరియస్ చేస్తున్నారు.. దీనికి ఎలాగైనా ఎండ్ కార్డ్ వేయాలని అల్లుఅర్జున్ డిసైడ్ అయ్యారు..తన అభిమానుల కోసం ఎక్స్ ద్వారా ఒక మెసేజ్ పంపించారు. తన అభిమానులు తమ అభిప్రాయాలను బాధ్యాతాయుతంగా చెప్పాలని ఆయన అన్నారు.

ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని వారిని సూచించారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్‌తో, ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని తెలిపారు..వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేసారు…నెగటివ్ పోస్టులు పెడుతున్న వారికి తన అభిమానులు దూరంగా ఉండాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని కోరారు.ఎవ్వరిపైనా దుర్భాషలకు దిగరాదని అల్లు అర్జున్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఈ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది…

Related posts

పవన్ కోసం మళ్ళీ రంగంలోకి రమణ గోగుల..?

murali

ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!!

murali

గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!!

murali

Leave a Comment