MOVIE NEWS

హిట్ కాంబో మళ్ళీ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్ తో ధనుష్ రెండో సినిమా..!!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గత ఏడాది రాయన్, కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.అద్భుతమైన కథలను ఎంచుకొని తనదైన పెర్ఫార్మన్స్ తో ధనుష్ అదరగొడుతున్నాడు.. తాను స్వయంగా తెరకెక్కించిన రాయన్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.హీరోగా,నిర్మాతగా, దర్శకుడిగా ధనుష్ అద్భుతంగా రానిస్తున్నారు.ధనుష్ ప్రస్తుతం కుబేర, ఇడ్లీ కడై వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.కుబేర సినిమాతో ధనుష్ మొదటి సారి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు..

‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!!

ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..స్టార్ హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీస్ త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ధనుష్ మరో బిగ్గెస్ట్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా, ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ధనుష్-వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న రెండో సినిమాకు ‘హానెస్ట్ రాజ్’అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న ధనుష్ అభిమానులు వీరి కాంబోలో మరో సూపర్ హిట్ రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు..కాగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ ఇప్పటికే ‘సార్’ అనే సినిమా చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా వున్నాయి..

Related posts

OG : పవన్ కల్యాణ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

పోటీ లో గెలిచిన అనిల్ రావిపూడి

filmybowl

Leave a Comment