న్యాచురల్ స్టార్ నాని దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఫామ్ లో వున్నాడు.. అదే ఊపులో వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.. ప్రస్తుతం నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హిట్ : ది థర్డ్ కేస్’.. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాకు ముందు గతంలో విడుదలైన రెండు సినిమాలకు నానినే నిర్మాతగా వ్యవహారించారు.. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.. ప్రస్తుతం తెరకెక్కుతున్న “హిట్ 3” సినిమాలో నాని నిర్మాతగానే కాకుండా హీరో గా కూడా నటించాడు. ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే అత్యంత క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో నాని నటించాడు. ‘హిట్ : ది సెకండ్ కేస్’ క్లైమాక్స్ లో చిన్న గెస్ట్ ద్వారా ‘అర్జున్ సర్కార్’ క్యారక్టర్ లో కనిపించిన నాని, ఆ పాత్రకు కొనసాగింపుగా ఈ సినిమా చేసాడు.
SSMB : భారీ ప్రెస్ మీట్ కి సిద్ధమవుతున్న రాజమౌళి..!!
నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మేకర్స్ విడుదల చేసారు. గతంలో కూడా నాని మాస్ రోల్స్ చేసాడు కానీ, ఈ సినిమాలోని మాస్ రోల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.టీజర్ ఆద్యంతం పూర్తిగా వైలెన్స్ తో నిండిపోయింది.. నానికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో క్లారిటీ గా చూపించారు..
‘నన్ను పోలీస్ అనుకునే మోసపోయారు జనాలు ఇన్నేళ్లు..మీకు చూపిస్తా నా ఒరిజినల్’ అంటూ నాని చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది.. టీజర్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఈ సినిమాలో కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కి.జె. మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు..