MOVIE NEWS

అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1 ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది…. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అదరగొడుతుంది. ప్రేక్షకుల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది.. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఏకంగా రూ.62 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించినట్లు గా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్.. ఈ సినిమా గురించి ట‍్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరో నానికి గ్లోబల్ స్టార్ రాంచరణ్ హ్యాట్సాఫ్ చెప్పాడు..

SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..?

‘హిట్ 3కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయని తెలిసింది. మై డియర్ బ్రదర్ నాని.. యూనిక్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసి, హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకి కూడా హ్యాట్సాఫ్. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు’ అని చరణ్ రాసుకొచ్చాడు..

వరుస సూపర్ హిట్స్ కొడుతున్న నాని త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఓ భారీ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. నాని కోసం, హిట్ 3 కోసం స్పెషల్ ట్వీట్ వేసినట్లు తెలుస్తోంది.అలానే వచ్చే ఏడాది మార్చి 26న నాని ‘ద ప్యారడైజ్’, మార్చి 27న చరణ్ ‘పెద్ది’ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని మేకర్స్ అధికారికంగానే ప్రకటించారు.మరి ఆ సమయానికి ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి.. నాని ప్యారడైజ్ సినిమాకు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దసరా కాంబో కావడంతో సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు…

Related posts

కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!!

murali

అల్లుఅర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు.. తడబడిన ఐకాన్ స్టార్..?

murali

బాలయ్య షోలో వెంకీ మామ.. ఇది కదా అసలైన ఎపిసోడ్ అంటే..!!

murali

Leave a Comment