న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగా, నిర్మాతగా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్ అదరగొట్టాడు..కోపం భాధతో కూడిన ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. ఆ తర్వాత ‘హిట్’ మూవీ రెండో పార్ట్ లో సెటిల్డ్ యాక్షన్‌తో అడివి శేష్ వావ్ అనిపించాడు. దీంతో ‘హిట్’ మూవీ మూడో పార్ట్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు..
మరో క్రేజీ సీక్వెల్ తో వస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..?
‘హిట్’ మూడో పార్ట్ లో నాని హీరోగా నటిస్తున్నాడు… అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా టీజర్ రిలీజ్ పై ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. హిట్ 3 టీజర్ ని ఫిబ్రవరి 24న రిలీజ్ చేయబోతున్నట్టు యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేసేసారు.మూవీ టీం చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.
ఈ సినిమాలో నాని సరసన కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీ నిర్మాణంలో నాని కూడా భాగం కాగా, దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్ 3’ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నాడు…ఇదిలా ఉంటే త్వరలో రాబోయే ‘హిట్ 4’ కోసం రవితేజ దాదాపు ఓకే అయ్యారని సమాచారం , ‘హిట్ 3’ క్లైమాక్స్‌లో రవితేజ కనిపించి సూపర్ ట్విస్ట్ ఇస్తారని టాక్ నడుస్తుంది..