Hindi singham is back with Ramayanam touch
MOVIE NEWS

రామాయణాన్ని ఇలా వాడేశారు

Hindi singham is back with Ramayanam touch
Hindi singham is back with Ramayanam touch

Hindi singham Ramayanam : రామాయణం ఎన్ని సార్లు తీసినా చూడడానికి ఇంతకంటే అభిమానులు ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది ఉంటారు. అలాగే రామాయణం కాన్సెప్ట్ మీద కూడా.

అదేలా అంటే రామాయణంలో పాత్రలని ప్రేరణగా తీసుకోని ఆ కథకి కొంచెం కావాల్సిన హంగులు జోడించి సినిమాగా. అప్పట్లో మణిరత్నం విక్రమ్ హీరోగా రావణ్ అనే సినిమా తీశారు. ఆ సినిమాకి రామాయణమే ప్రేరణ. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మరో సినిమా అదే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

నార్త్ లో సౌత్ టైప్ డైరెక్టర్ అని చెప్పుకునే రోహిత్ శెట్టి
సింగం ఫ్రాంచైజ్ లో భాగం గా సింగం అగైన్ ని దీపావళి కానుకగా దించుతున్నాడు.

అస్సలు ప్రజలకి సింగం ని పరిచయం చేసింది తమిళ స్టార్ హీరో సూర్య, ఫాస్ట్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ హరినే. ఐన కానీ దాన్ని విజయవంతంగా సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తూ ముందుకు తీసుకెళ్తున్నది మాత్రం రోహిత్ శెట్టినే.

మాస్ పోలీస్ గా సింగం ని చూయిస్తూ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మొట్ట మొదటిసారిగా ఆల్మోస్ట్
అయిదు నిమిషాల ఉన్న ట్రైలర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. అంతేకాదు హిందీలోనే ఈ సినిమా అతి పెద్ద మల్టీస్టారర్స్ లో ఒకటిగా దీనికి ప్రత్యేకంగా స్థానం లభిస్తుంది అనడం లో సందేహం లేదు.

Read Also : పరుశురాం నెక్స్ట్ హీరో అతనేనా…

పోలీస్ కథలు ఎప్పుడు ఒకే ఫార్మాట్ లో ఉంటాయి. స్క్రీన్ ప్లే లో మార్పులు తప్పించి అప్పటి కొండవీటి సింహం నుంచి రేపు రాబోయే స్పిరిట్ వరకు కాకపోతే ఇందులో రోహిత్ శెట్టి చాలా తెలివిగా రామాయణాన్ని ఈ కథలో ఇంక్లూడ్ చేసి సినిమాగా మన ముందుకి తీసుకొస్తున్నాడు.

పోలీస్ ఆఫీసర్ అయిన సింగం ఈ సినిమా లో రాముడు పోలిన పాత్ర. ఆయన భార్య కరీనా కపూర్ సీతాదేవి ని పోలిన పాత్ర. ఇక శ్రీలంకలో ఉండే విలన్ అర్జున్ కపూర్ ఎవరో మీకు ఈ పాటికే అర్ధమై ఉంటది

ఇంకేముంది అర్జున్ కపూర్…. కరీనా ని ఎత్తుకెళ్లిపోతాడు. ఇక భార్య ని కాపాడి తీసుకు రాడానికి బయల్దేరిన సింగం కి సాయం కోసం హనుమంతుడు మన రణ్వీర్ సింగ్ సాయపడతాడు
సింగం సోదరుడి గా లక్ష్మణుడి తరహా పాత్రలో టైగర్ శ్రోఫ్ గరుత్మంతుడి గా అక్షయ్ కుమార్ కనిపిస్తాడు. ఇంకా ఈ కధలో ఇంకో పాత్ర లేడీ సింగం గా దీపికా పదుకునే కనిపించనుంది.

ఈ పాత్రలన్నీ కలిసి అపహరించుకుపోయిన రావణుడి పని పట్టి సీతను కాపాడుకోవడం ఎలా చేశారనే పాయింట్ మీద ఈ కొత్త సింగం నడుస్తుంది.

ఎప్పటిలాగే మాస్ మసాలా మోతాదుకు మించి దట్టించాడు దర్శకుడు రోహిత్ శెట్టి. యాక్షన్ ఎపిసోడ్లు, ఛేజింగులు, బాంబ్ బ్లాస్టులు, వాహనాల హంగామా, హెలికాప్టర్స్ లతో యుద్దాలే డిజైన్ చేసాడు.

నార్త్ బిజినెస్ సర్కిల్ ప్రకారం మంచి ఓపెనింగ్ తో పాటు వార్ జవాన్ రికార్డులను సులభంగా బద్దలు కొట్టిద్ది అంటున్నారు సింగం అగైన్.

కథ రామాయణం కాబట్టి దానికి ఢోకా ఉండదు. మాస్ ఎలేవేషన్స్ సాలిడ్ గా ఉండి మాస్ కి కనెక్ట్ అయితే మాత్రం సింగల్ స్క్రీన్లలో సింగం గర్జన ని ఎవరు ఆపలేరు.

Follow us on Instagram

Related posts

ప్రమోషన్స్ షురూ చేయనున్న పుష్పా

filmybowl

మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

మహేష్ సినిమా కోసం రంగంలోకి మరో స్టార్ ప్రొడ్యూసర్.. జక్కన్న ప్లానింగ్ అదిరిందిగా..!!

murali

Leave a Comment