ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది…ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.. రాజమౌళి బాహుబలి 2 తో అందుకున్న భారీ రికార్డు పుష్ప 2 క్రాస్ చేసింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి పుష్ప 2 మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది..ఈ సినిమాలో ప్రతీ సీన్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎంతగానో ఎగబడ్డారు.. అంతే కాకుండా రీ లోడెడ్ వెర్షన్ అంటూ మరో 20 నిముషాలు యాడ్ చేయడంతో ఈ సినిమాకి మళ్ళీ హోస్ ఫుల్ కలెక్షన్స్ లభించాయి.
అఖండ 2 : బాలయ్య మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరో.. ఎవరో తెలుసా..?
పుష్ప 2 సినిమాకు ఇంత క్రేజ్ లభించినా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అందరికి షాక్ ఇచ్చింది.. ఆ ఒక్క రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో పుష్ప 2 టీం ఒక్కసారిగా షాక్ అయింది.. అల్లుఅర్జున్ ని అరెస్ట్ కూడా చేయడంతో విషయం మరింత పీక్స్ కి వెళ్ళింది..బెయిల్ మీద రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ ముఖంలో సంతోషం కరువైంది.. పైగా తాను ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో మీమ్స్ బాగా వైరల్ అయిపోతున్నాయి.. దీనితో అప్పటి నుంచి ఎలాంటి ఫంక్షన్ కి హాజరవ్వాలి అన్నా అల్లుఅర్జున్ ఆలోచించే పరిస్థితి ఏర్పడింది..
తాజాగా పుష్ప 2 సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో మేకర్స్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేసారు.. ఈ థాంక్స్ మీట్ లో అల్లుఅర్జున్, సుకుమార్ లు పాల్గొన్నారు.. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్ దే అని చెప్పారు. నేను ఇంతగొప్పగా నటించేందుకు అసలు కారణం సుకుమారేనని అల్లుఅర్జున్ తెలిపారు.. దీనితో ఎమోషనల్ అయిన సుకుమార్ స్టేజ్ పైకి వచ్చి బన్నీ ని ఆలింగనం చేసుకున్నారు..డార్లింగ్ నువ్వు ఎమోషనల్ అవ్వకు నేను ఎమోషనల్ కూడా అవుతా ప్రతీ ఈవెంట్ లో ఏడిస్తే బాగోదు అని అల్లుఅర్జున్ అన్నాడు..