MOVIE NEWS

“పుష్ప 2” ని ప్రశంసించిన ఏకైక స్టార్ హీరో అతనే..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ అయి వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. అల్లుఅర్జున్ కెరీర్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ ఏ సినిమాకి రాలేదు.. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది..కేవలం 6 రోజుల్లోనే ఏకంగా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకుని పుష్ప 2 రికార్డ్ సృష్టించింది..సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.

రాజమౌళి చెప్పిందే నిజమైంది.. ఇక నుంచి అసలైన బాక్సాఫీస్ వార్ షురూ..!!

అయితే సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా ఈ సినిమాను మెచ్చుకోలేదు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ చిత్రాన్ని బహిరంగంగా ప్రశంసించిన మొదటి స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ చేసిన ఉరుము మరియు మరపురాని ప్రదర్శన..నేను స్క్రీన్‌పై మీ నుండి కళ్ళు తీయలేకపోయాను.దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ చిత్ర విజయాన్ని ఓ పండగలా జరుపుకోవడం చాలా సంతోషాన్నిస్తుంది.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్నా మీరు అద్భుతంగా నటించారు..

ఇంతటి అద్భుతమైన సినిమా తెరకెక్కించిన సుకుమార్ కి నా అభినందనలు.. అలాగే DSP మ్యూజిక్ తో అదరగొట్టాడు.. ఇంతటి అద్భుత చిత్రాన్ని ఇచ్చిన పుష్ప 2: ది రూల్ టీమ్ మొత్తానికి అభినందనలు. అస్సలు తగ్గేదే లే.. అని ఆయన ట్వీట్ చేసారు..వెంకటేష్ ట్వీట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కృతజ్ఞతతో వెంటనే ధన్యవాదాలు సర్ అంటూ స్పందించారు.మీ నుండి వచ్చిన ఈ ప్రసంశలు మాకు ఎంతో ప్రత్యేకం..మీరు మా పనిని ఇష్టపడినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు సర్ అని అల్లుఅర్జున్ రిప్లై ఇచ్చారు.

Related posts

అందరూ కలిసి బన్నీని ఒంటరి చేసారు.. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!

murali

డాకు మహారాజ్ : మామ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లుడి ఆగమనం ..?

murali

డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

murali

Leave a Comment