MOVIE NEWS

హరిహర వీరమల్లు : ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “హరిహర వీరమల్లు”.. ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..ఫ్యాన్స్ ఈ సినిమా కోసం గత అయిదేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు..హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ని రేపు అనగా జులై 3 ఉదయం 11 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

అఖండ 2 : బాలయ్య మూవీలో బజరంగి భాయి జాన్ బ్యూటీ..!!

అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.. దీంతో ఫ్యాన్స్ ఆయా థియేటర్స్ వద్ద సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలో మూవీ యూనిట్ సైతం ఓ థియేటర్లో సందడి చేయబోతుంది.హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ మరియు నిర్మాతలు ఏఎం రత్నం, దయాకర్ రావులు హైదరాబాద్ లోని విమల్ థియేటర్లో రేపు ఉదయం ట్రైలర్ రిలీజ్ కు హాజరు కానున్నారు..అనంతరం మీడియా సమావేశం కూడా ఉండనుందని తెలుస్తుంది… దీంతో ఆ థియేటర్ వద్దకు ఫ్యాన్స్ భారీగా చేరుకోబోతున్నారు.

ఛాన్నాళ్లకు పవన్ కళ్యాణ్ నటించిన భారీ సినిమా రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.అయితే ఈ ఏడాది పవన్ ఫ్యాన్స్ కి డబల్ బొనాంజా అని చెప్పాలి.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న “ఓజీ “ సినిమా కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

Related posts

గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?

murali

ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..?

murali

రామాయణాన్ని ఇలా వాడేశారు

filmybowl

Leave a Comment