MOVIE NEWS

హరిహర వీరమల్లు : ‘మాట వినాలి’ అంటున్న పవన్ న్యూ స్టిల్ అదిరిందిగా..!!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా మొదలై చాలా కాలం కావడంతో కొంత భాగం వరకు డైరెక్ట్ చేసిన జాగర్లమూడి క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.. మిగిలిన భాగాన్ని చిత్ర నిర్మాత ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు..ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. నిర్మాత ఏఎమ్ రత్నం గ్రాండ్ గా నిర్మిస్తోన్న హరిహర వీరమల్లు మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఔరంగజేబు నాటి కాలంలో ఈ కథ సాగుతుందని మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. టికెట్స్ రేట్స్ భారీగా పెంపు..!!

హిస్టారికల్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఎంచుకున్న పాత్రలతో పాటు భారీ సెట్స్ కూడా అదిరిపోయాయి..అయితే ఈ చిత్రం మార్చి 28న విడుదల కావడం కష్టమే అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా మేకర్స్ ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు… ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఓ వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని సమాచారం… త్వరలోనే ఆ వారం రోజుల డేట్స్ ఇచ్చి సినిమా పూర్తి చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు..ముందుగా ఒకే పార్ట్ గా మొదలైన ఈ మూవీ ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కుతుంది..కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే మార్చిలో విడుదల చేస్తారు. మరి సెకండ్ పార్ట్ సంగతేంటో తెలియాల్సి వుంది…

అయితే పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎక్కువగా ‘ఓ.జి’ సినిమా మూడ్ లో ఉన్నారు.కానీ హరిహర వీరమల్లు సినిమా ముందు రిలీజ్ అవుతుంది.. ఓజి లేట్ అయిన ఎట్టకేలకు పవన్ నుంచి ఓ సినిమా వస్తుందటంతో ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ గా వున్నారు..తాజాగా వీరమల్లు సినిమాలో “మాట వినాలి”అనే సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను తెలియజేస్తూ మేకర్స్ విడుదల చేసిన పవన్ కళ్యాణ్ స్టిల్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ వెన్నెల రాత్రి చలిలో వెచ్చని మంట ముందు కంజీరాను వాయిస్తూ ఆనందంతో ఉన్న పవన్ స్టిల్ ఎంతగానో ఆకట్టుకుంటుంది..పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా ఐదు భాషల్లో సోమవారం ఉదయం 9 .06 నిమిషాలకు మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ పాటను పవన్ స్వయంగా పాడటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Related posts

‘సినిమాలు తీయడం మానేస్తా’.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..!!

murali

విశ్వంభర : మెగాస్టార్ మూవీ సమ్మర్ కి కూడా కష్టమేనా..?

murali

గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!!

murali

Leave a Comment