పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”.. దాదాపు ఐదేళ్ల నిరీక్షణ తరువాత ఈ సినిమా రిలీజ్ కి సిద్దమైంది..షూటింగ్ ఆలస్యం,విడుదల తేదీ వరుస వాయిదా ఇలాంటి అన్నీ అడ్డంకులు దాటుకొని ఈ సినిమా జులై 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ సారి రిలీజ్ అస్సలు వాయిదా ఉండదు అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది..
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో బిగ్ ఛాన్స్ కొట్టేసిన చైతూ బ్యూటీ..?
ఛాన్నాళ్లకు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది..ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి, కాశీలో నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి… తిరుపతిలో ఈవెంట్ పనులు కూడా మొదలుపెట్టారు. కానీ సినిమా వాయిదా పడటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి రిలీజ్ దగ్గర పడుతుండటంతో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చర్చ జరుగుతుంది.
గతంలో అనుకున్నట్టే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ సౌత్ లో తిరుపతిలో, నార్త్ లో వారణాసి లో పెట్టనున్నట్టు సమాచారం. వారణాసి లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 17న ఉంటుందని ఆ ఈవెంట్ కి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గెస్ట్ గా వస్తారని సమాచారం. సనాతన ధర్మం కోసం పోరాడుతూ, బీజేపీ తో పొత్తులో ఉండటంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం కోసం నిలబడే యోగి ఆదిత్యనాథ్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపిస్తే నేషనల్ వైడ్ ఆ ఈవెంట్ కచ్చితంగా వైరల్ అవుతుందని సమాచారం. అలాగే సినిమాకు కూడా బాగా కలిసి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు..
