MOVIE NEWS

హరిహర వీరమల్లు : “కొల్లగొట్టినాదిరో” ప్రోమో అదిరిందిగా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’..గత ఏడాది ఎన్నికల కారణంగా పవన్ నటిస్తున్న భారీ సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ ఆ సినిమాల షూటింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ముందుగా హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేయాలనీ పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు..అయితే ‘హరిహర వీరమల్లు’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుందటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.కానీ సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.. మిగిలిన భాగాన్ని ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ “డియోల్” కీలక పాత్రలో నటిస్తున్నాడు..ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

ఫౌజీ : క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది..ఈ సినిమాను మేకర్స్ మార్చి 28న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు… ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ ‘హరి హర వీరమల్లు’మూవీ నుంచి వరుస అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూసారు.

తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. ‘హరిహర వీరమల్లు’ సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ ప్రొమోను నేడు విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించారు..అలాగే హాట్ బ్యూటీస్ అనసూయ, పూజితా పొన్నాడ కూడా ఈ పాటలో మెరిసారు..ఈ ఊరమాస్ సాంగ్‌ ఫుల్ లిరికల్ వీడియోను మేకర్స్ ఫిబ్రవరి 24న సాయంత్రం 3 గంటలకు గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

 

 

Related posts

మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!!

murali

ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

బాలయ్య షోలో వెంకీ మామ.. ఇది కదా అసలైన ఎపిసోడ్ అంటే..!!

murali

Leave a Comment