పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బిగ్గెస్ట్ పిరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి మొదట దర్శకత్వం వహించారు… కొంత మేర షూటింగ్ జరిగాక పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో క్రిష్ కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా హరిహర వీరమల్లు దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు.దీనితో హరిహర వీరమల్లు మూవీ నిర్మాత అయిన ఏఎం రత్నం పెద్దకుమారుడు అయిన జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేసారు..
ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!!
ఐదేళ్లు పాటు కొనసాగిన ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తి కావడంతో మేకర్స్ ఈ సినిమాను జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు..మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు క్రిష్ చేసిన ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్ గా మారింది.
హరి హర వీర మల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. కానీ నిశ్శబ్దంగా కాదు. ప్రతి ఫ్రేమ్ లో చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు వస్తున్నాడు. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా సాధ్యమైంది. సినిమాలోనే కాదు, ఆత్మ విశ్వాసంలోనూ మన పవన్ కళ్యాణ్ ఒక అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరా చూపించలేని ఒక పవర్ ఉంది. ఆయన నిత్యం మండే స్ఫూర్తి హరి హర వీరమల్లులోకి ప్రాణం పోసింది. ఆయన హరిహర వీరమల్లుకు వెన్నెముక. ఏ.ఎం రత్నం ఒక గొప్ప శిల్పి. బలమైన విశ్వాసంతో సినిమాలు నిర్మించగలడం ఆయన సామర్థ్యం. హరిహర వీరుమల్లు సినిమా రూపొందింది అంటే అది ఆయన నిరంతర కృషి వల్లనే అని చెప్పాలి..ఈ ఇద్దరు దిగ్గజాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతను అందిస్తున్నాను ఈ సినిమా నా గొప్ప సినిమాలలో ఒకటిగా మారుతుంది.. సంవత్సరాల తరబడి కొనసాగిన అగ్ని మరియు విశ్వాసం యొక్క ముగింపు చివరకు చేరుకుంది. ఇది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండబోతుందని క్రిష్ ట్వీట్ చేసారు..
Now… Hari Hara Veera Mallu walks into the world. Not quietly.. but with purpose.. with the weight of history and passion behind every frame. This journey was made possible by two great legends… not just in cinema, but in spirit..
🔥Our PAWAN KALYAN garu.. an extraordinary… pic.twitter.com/KZo14F1M2a
— Krish Jagarlamudi (@DirKrish) July 22, 2025
