పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ “ హరిహర వీరమల్లు”.. ఈ సినిమా షూటింగ్ మొదలయి చాలా కాలం అవుతున్న రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు.. పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ హోల్డ్ లో పడింది.. దీనితో ఈ సినిమాను కొద్ది భాగం తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ సినిమా నుండి తప్పుకున్నాడు.. మిగిలిన భాగం షూటింగ్ ను ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నాడు.. తాజాగా ఈ సినిమాకు పవన్ డేట్స్ ఇవ్వడంతో మేకర్స్ చక చకా షూటింగ్ నిర్వహిస్తున్నారు.. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది.ఉగాది సందర్భంగా చిత్రబృందం పవన్ కల్యాణ్ కొత్త లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
జల్సా : పవర్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీకి 17 ఏళ్లు..!!
తాజాగా రిలీజ్ చేసిన లుక్ లో పవన్ కల్యాణ్ స్టైలిష్ గా కనిపించారు. పవర్ స్టార్ లుక్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. తాజాగా హరిహర వీరమల్లు క్లైమాక్స్ కు సంబంధించిన అప్ డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని..ఫ్యాన్స్ కు థియేటర్లో పూనకాలే అని సమాచారం.హరిహర వీరమల్లు క్లైమాక్స్ సీన్స్ 42 రోజుల పాటు షూట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఇప్పటివరకు చేసిన వాటిలో లాంగ్ షూట్ ఇదేననటా.
ఇరాన్‌లో 8 నిమిషాల పోస్ట్-క్లైమాక్స్ సీక్వెన్స్‌ను మేకర్స్ రూపొందిస్తున్నారు.ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, గ్లింప్స్, “మాట వినాలి”, “కొల్లగొట్టినాదిరో” అనే రెండు సింగిల్స్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మూడో సాంగ్ రిలీజ్ కు కూడా డేట్ లాక్ అయినట్లు సమాచారం.ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం మే 9న ఫస్ట్ ఫార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.