MOVIE NEWS

హమ్మయ్య పుష్ప పార్ట్ 3 పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ అదిరిందిగా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కు గత నెల రోజుల నుండి మేకర్స్ నాన్ స్టాప్ ప్రమోషన్స్ నిర్వహించారు.. ఇండియా మొత్తం భారీ ఈవెంట్స్ ఏర్పాటు చేసి సినిమాపై బాగా హైప్ తీసుకొచ్చారు.చివరిగా హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసారు.. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు దర్శకుడు ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా వచ్చారు..

ఛత్రపతి శివాజీగా కాంతార నటుడు.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!!

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ను పుష్ప2 సినిమాకు సీక్వెల్ గా పుష్ప3 కూడా కావాలని ఫ్యాన్స్ కోరారు..దీనికి బదులుగా సుక్కు మాట్లాడుతూ బన్నీ మూడు ఏళ్లు డేట్స్ ఇస్తే కనుక కచ్చితంగా చేస్తానని తెలిపారు.ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప3 కి సంబంధించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. పుష్ప2 ఫైనల్ మిక్సింగ్ ను ఫినిష్ చేస్తూ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టి చేసిన పోస్ట్ లో బ్యాగ్రౌండ్ లో స్క్రీన్ పై “పుష్ప 3 ది ర్యాంపేజ్ “ అని లోగో తో పోస్టర్ డిజైన్ చేసి ఉండడంతో పుష్ప సిక్వెల్ ముందే ఫిక్స్ చేసినట్టు కన్ఫార్మ్ అయింది.

అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ 2022 లో పుష్ప ది రైజ్, పుష్ప -2 ది రూల్, పుష్ప -2 ది ర్యాంపేజ్ సినిమాలు చేస్తున్న సుకుమార్ కు బర్త్ డే విష్ చేస్తూ ఓ ట్వీట్ చేసాడు.దీనితో పుష్ప3 సినిమా ఎప్పుడో ఫిక్స్ అయిందని విజయ్ తన ట్వీట్ తో అప్పుడే చెప్పేసాడు.. ప్రస్తుతం ఆ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. “పుష్ప3”ఫోటో లీక్ కావడంతో తేరుకున్న సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆ ఫోటోను వెంటనే డిలీట్ చేసాడు. కానీ అప్పటికే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.అయితే పుష్ప 2 కే ఇన్నేళ్లు తీసుకున్న సుకుమార్ పుష్ప 3 ఎప్పటికి తెరకెక్కిస్తారో చూడాలి..

Related posts

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

murali

Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

murali

Leave a Comment