MOVIE NEWS

జింఖానా : మరో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో వస్తున్న ప్రేమలు హీరో..!!

మలయాళం సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్న ప్రేమలు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాలో హీరో నస్లెన్ తన కామెడీ టైమింగ్ తో ఎంతగానో అకట్టుకున్నాడు.. ఆ హీరోకి తెలుగులో పిచ్చ క్రేజ్ ఏర్పడింది.. దీనితో మరో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో హీరో నస్లెన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.నస్లెన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జింఖానా’..ఇప్పటికే ఈ మూవీ మళయాలంలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 25న ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తెలుగులో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా.. సర్వత్రా ప్రశంసలు..!!

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ ను చూస్తుంటే.. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో యూత్ ను ఎంటర్ టైన్ చేసే కోణంలో తీసినట్టు తెలుస్తోంది.బాక్సింగ్ కోసం కష్టపడే కొందరు కుర్రాళ్ల జీవితాలను బేస్ చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. బాక్సింగ్ ను టైమ్ పాస్ కోసం స్టార్ట్ చేసిన వాళ్ళు చివరకు దాన్ని ఓ పాషన్ గా మార్చుకుంటే ఏం జరుగుతుంది అనేది మూవీ స్టోరీ. ఇందులో కూడా కామెడీకి ఎక్కువగా స్కోప్ ఇచ్చారు.

డైరెక్టర్ ఖలీడ్ రెహమాన్ సినిమాను తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా అనిపిస్తోంది. తెలుగు ట్రైలర్ డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి.. హీరో నెస్లెన్ ఈ సారి కూడా మరో సూపర్ హిట్ అందుకోనున్నాడు..ఈ సినిమాలో. లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్, అనఘ మాయ రవి కీలక పాత్రల్లో నటించారు..

  1. https://youtu.be/vcg_2lTBRTY

Related posts

భారీ రేటుకి ‘పెద్ది’ ఆడియో రైట్స్..!!

murali

గ్లోబల్ స్టార్ బర్త్డే ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..!!

murali

OG : ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..?

murali

Leave a Comment