MOVIE NEWS

ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడిగా గుర్తింపు పొందారు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన “గుంటూరు కారం” రిలీజ్ అయింది.. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత తన తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

సుకుమార్ ని కలిసిన ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

త్రివిక్రమ్ మొదట అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది.. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేసాడు.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో అల్లుఅర్జున్ ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.. దీనితో త్రివిక్రమ్ ఈ లోపు మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.తాజాగా త్రివిక్రమ్ మరో స్టార్ హీరోని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది..తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ధనుష్ టాలీవుడ్ దర్శకులతో కలిసి పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ధనుష్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది..

త్రివిక్రమ్ సినిమాలు అంటేనే డైలాగ్‌లలో పంచ్, కథలో డెప్త్, ఎమోషనల్ కనెక్ట్‌తో పాటు మరింత వినోదాన్ని ప్రేక్షకులు ఆశిస్తారు. అలాగే ధనుష్ నుంచి విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులు ఆశిస్తారు.. దీనితో వీరిద్దరి కాంబోలో సినిమా ఎలా వుంటుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు..ధనుష్ తో త్రివిక్రమ్ మూవీ అంటే కొంచెం కొత్తగా వున్నా వర్కౌట్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

Related posts

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

murali

“ఫౌజీ” మ్యాజిక్ మాములుగా ఉండదు.. హను రాఘవపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

చరణ్ ని ఆటపట్టించిన బాలయ్య.. వీడియో వైరల్..!!

murali

Leave a Comment