MOVIE NEWS

కథ ఏంటో గెస్ చేయండి.. బైక్ గెలుచుకోండి.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్..!!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రాజావారు,రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో ఎస్. ఆర్ కల్యాణమండపం సినిమాతో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.అయితే ఆ తరువాత కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేసాడు.. కానీ ఎందుకో అవేవి కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో కిరణ్ అబ్బవరం సరికొత్త కథలను ఎంచుకునే ప్రయత్నం చేసాడు.. రీసెంట్ గా ‘క’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ‘క’ సినిమా మంచి సక్సెస్ సాధించింది..ఆ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ లవ్ ఎంటర్‌టైనర్ ‘దిల్ రూబా’.ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుంగా.. ఈ చిత్రంతోనే విశ్వకరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఛావా : తెలుగు ట్రైలర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

మార్చి 14న ఈ మూవీ రిలీజ్ అవుతుండగా.. తాజాగా హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు బంపరాఫర్ ప్రకటించారు. ఈ సినిమా కథ ఏంటో గెస్ చేస్తే సినిమాలో తాను వాడిన బైక్‌ను గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటించారు. ఆ బైక్ అంటే తనకు చాలా ఇష్టమని బైక్‌ను చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియో షేర్ చేశారు. ‘దిల్ రూబా మూవీ నా కోపం, లవ్‌ల సమ్మేళనం. ఈ బైక్ అంటే నాకు ఎంతో ఇష్టం. మా ఆర్ట్ డైరెక్టర్ ఎంతో శ్రమించి మూవీ కోసం దీన్ని తయారుచేశారు. ఇది మార్కెట్‌లో మీకు ఎక్కడా దొరకదు. అందుకే ఈ బైక్‌ను మీకు గిఫ్ట్‌గా ఇచ్చేయాలనుకుంటున్నా. ఈ బైక్‌ను సొంతం చేసుకునేందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. ఇప్పటివరకూ విడుదలైన పాటలు, వీడియోలు మరియు ప్రమోషన్స్‌లో మేము చేసిన కామెంట్స్ ఆధారంగా ఈ మూవీ స్టోరీని మీరు చెప్పాలని కిరణ్ తెలిపారు…

ఈ సినిమా కథను క్రియేటివ్‌గా చెప్పినవాళ్లకు ఈ బైక్ బహుమతిగా ఇస్తానని తెలిపారు.అలాగే, బైక్ గెలుచుకున్న వ్యక్తితో ఫస్ట్ డే ఫస్ట్ షో కలిసి చూస్తాను అని కిరణ్ బంపరాఫర్ ఇచ్చారు.ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు..

 

 

Related posts

మహేష్ సినిమా కోసం రంగంలోకి మరో స్టార్ ప్రొడ్యూసర్.. జక్కన్న ప్లానింగ్ అదిరిందిగా..!!

murali

చరణ్ మీద ఎంతో భారం…. మోస్తాడంటారా…

filmybowl

కాంతార తో వార్ అయేటట్లుందే

filmybowl

Leave a Comment