MOVIE NEWS

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్పిరిట్ టీం బంపర్ ఆఫర్..!!

ప్రెజెంట్ జెనరేషన్ లో చాలా మంది యూత్ సినిమాలలో రానించాలని ఎంతో ఆశపడుతుంటారు.. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్ లో అదంత ఈజీ కాదు.. టాలెంట్ వున్న ఆర్టిస్టులు చాలా మంది అవకాశాల కోసం పడిగాపులు కాస్తున్నారు..సినిమాల్లో నటించే అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అయితే టాలెంట్ వున్న ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు.. సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారికి అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తున్నాయి.. తాజాగా ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో “స్పిరిట్ “ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..

తన డ్రీమ్ డైరెక్టర్ డైరెక్షన్ లో మూవీకి సిద్ధమవుతున్న నాని..!!

సందీప్ రెడ్డి సోదరుడు  ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతగా భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ పై ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను కూడా ఈ బ్యానర్ మీదే నిర్మించారు.. ఆ తర్వాత సందీప్ రెడ్డివంగా చేసే  అన్ని సినిమాలలో ఈ బ్యానర్ కూడా సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తూ వస్తుంది..తాజాగా ఈ బ్యానర్ తమ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా తాము తెరకెక్కించే ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కల్పిస్తున్నామని ప్రకటించింది.

అయితే సినిమా లేదా థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు మాత్రమే అందుకు అర్హులు అని వారు తెలిపారు.ఒక హెడ్ షాట్ ఫోటోతో పాటు పర్సనల్ షాట్ ఫోటో కూడా జత చేయాలని కోరారు. ఇక ఇంట్రడక్షన్ వీడియోలో సంబంధిత వ్యక్తీ పేరు ఇతర వివరాలతో పాటు వారి చదువుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాలని కోరారు. ఈ వివరాలను spirit.bhadrakalipictures@gmail.com కి పంపాలని వారు కోరారు. ప్రభాస్ తో నటించాలని ఆసక్తి ఉన్నవారంతా ఇప్పటికే తమ వివరాలను పంపించేస్తున్నారు. దీనితో ప్రభాస్ స్పిరిట్ మూవీ సరికొత్త నటులతో డిఫరెంట్ ఉండబోతుందని తెలుస్తుంది..

Related posts

మావయ్య నాగబాబుని కలిసిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్..!!

murali

బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్..తమన్ ని సైడ్ చేసారా..?

murali

“మాస్ జాతర” గ్లింప్స్ అదిరిందిగా..వింటేజ్ రవితేజ కంబ్యాక్ గ్యారెంటీ..!!

murali

Leave a Comment