MOVIE NEWS

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 AD’..గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.కల్కి సినిమాతో ప్రభాస్ కెరీర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది..ఇదిలా ఉంటే ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఇది వరకే క్లారిటీ ఇచ్చారు.

RC16 : అలాంటి పాత్రలో రాంచరణ్.. ఫ్యాన్స్ కి పండగే..!

ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2 కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ‘కల్కి 2898 AD’ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ‘అశ్వత్థామ’ పాత్రను పోషించారు. ఇక సీక్వెల్ లో కూడా ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోఅమితాబ్ కూడా కల్కి 2 షూట్ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం..

తాజాగా అమితాబ్ ఈ క్రేజీ సీక్వెల్ పై సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ షో ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగ్ బీ మాట్లాడుతూ కేబీసీ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానని ఆయన తెలిపారు..దీనితో ఈ బిగ్గెస్ట్ సీక్వెల్ షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని సినీ వర్గాల సమాచారం.. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు

Related posts

బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి

filmybowl

భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..?

murali

మెగాస్టార్ ” విశ్వంభర ” సమ్మర్ కైనా వచ్చేనా..?

murali

Leave a Comment