గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి..
గ్లోబల్ వైడ్ అదరగొడుతున్న ‘దేవర’.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే..!!
ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ కీలక పాత్ర పోషిస్తుంది.. అలాగే ఎస్. జె. సూర్య, సునీల్, నవీన్ చంద్ర వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు..ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..మరో రెండు వారాల్లో ఈ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది..ఈ సినిమా విడుదలతో మెగా ఫ్యాన్స్ సంక్రాంతి వేడుకలు ముందుగానే ప్రారంభం కానున్నాయి.అంతకంటే ముందు న్యూ ఇయర్ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ‘గేమ్ ఛేంజర్’ మేకర్స్ సిద్ధమవుతున్నారు. సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. తమన్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకుంది..
అలాగే లక్నోలో గ్రాండ్గా విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో థియేట్రికల్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధం అయింది.. ఇప్పటికే ట్రైలర్ కట్స్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.డిసెంబర్ 27న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందని భావించినా కానీ , అది వాయిదా పడింది. ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.. అయితే తాజాగా జనవరి 4, 2025న థియేట్రికల్ ట్రైలర్ ని ప్రత్యేక ఈవెంట్లో విడుదల చేయనున్నారు.. దీనితో ఇప్పటికే ఫ్యాన్స్ లో ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి