MOVIE NEWS

డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “సలార్ 2” మైండ్ బ్లోయింగ్ అప్డేట్..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఊహించని క్రేజ్ అందుకున్నాడు.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు పార్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించాయి.. భారీ కలెక్షన్స్ సైతం సాధించి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించాయి.. బాహుబలి క్రేజ్ తో ప్రభాస్ ఆ తరువాత వరుస పాన్ ఇండియా సినిమాలలో నటించాడు..కానీ ఏ సినిమా కూడా బాహుబలి రేంజ్ హిట్ సాధించలేకపోయాయి.. అయితే ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్.. వరుస ప్లాప్స్ తరువాత ప్రభాస్ కి ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది..కానీ సలార్ సినిమా హిట్ అయిన ఫ్యాన్స్ మాత్రం సంతోషంగా లేరు.సలార్ సాధించిన విజయం సరిపోదని, వసూళ్ల పరంగా ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయారు..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.

“కాంచన 4” మొదలెట్టిన లారెన్స్.. ఈ సారి మరింత కొత్తగా..!!

ప్రశాంత్ నీల్ టార్గెట్ 1000 కోట్లపైనే.. కానీ సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద 650-700 కోట్ల మధ్యనే సాధించింది.ఈ సినిమా కోసం ప్రభాస్-ప్రశాంత్ నీల్ ఎంతో కష్టపడి పనిచేసారు. సినిమా బడ్జెట్ మాత్రమే 300 కోట్లు. దీంతో ఇప్పుడా లెక్కలన్నింటిని `సలార్ -2` తో బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఏకంగా 2000 కోట్ల మార్క్ ని దాటాలనే అతిపెద్ద టార్గెట్ ని మేకర్స్ ఫిక్స్ చేసుకున్నారు… సలార్ విషయంలో ప్రేక్షకుల నుండి కొంత నెగిటివ్ టాక్ కూడా వచ్చింది… స్టోరీ అర్దం కాలేదనే టాక్ బలంగా వినిపించింది… రెండవ పార్ట్ విషయంలో అలాంటి వాటికి తావు ఇవ్వకుండా పక్కా ప్లాన్ తో తెరకెక్కించాలని చూస్తున్నారు.అయితే ఈసినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు.

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా లతో బిజీగా ఉండటం…ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవ్వడంతో సలార్ 2 సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..ఈ నేపథ్యంలో తాజాగా `సలార్ 2` పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను మేకర్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది..స్పెషల్ అనౌన్స్ మెంట్ పేరుతో ఫ్యాన్స్ కిక్ ఇచ్చే విషయం చెప్పాలని వారు భావిస్తున్నారట.ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారో  ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే వాటిపై స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనుట్లు తెలుస్తుంది..

 

Related posts

గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!!

murali

“ఓజి” మూవీకి సెకండ్ పార్ట్..పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..!!

murali

హరి హర వీరమల్లు: పవన్ కళ్యాణ్‌ తిరిగి సెట్స్‌లో

filmybowl

Leave a Comment