MOVIE NEWS

డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ మొదలయ్యేది అప్పుడే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో తన కెరీర్ లో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న “ రాజాసాబ్ “ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైనప్ లో సలార్ 2,ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ సినిమాలు వున్నాయి.. అలాగే గత ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన కల్కి సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కల్కి 2 కోసం ఫ్యాన్స్ సైతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ప్రభాస్ “స్పిరిట్” మూవీలో మెగా హీరో.. వంగా మావ ప్లాన్ అదిరిందిగా..!!

ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించినదానికంటే మించి ఈ సీక్వెల్ ఉంటుందట.. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్‌ క్యారెక్టర్‌ ని మరింత అద్భుతంగా చూపించ నున్నట్లు తెలుస్తుంది.. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.కానీ వైజయంతీ మూవీస్ మాత్రం వీలైనంత త్వరగా కల్కి 2ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు..సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా కూడా లైన్లో ఉంది. కాబట్టి కల్కి 2 ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదని అంతా అనుకున్నారు.

కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ఏడాది జూన్‌ నుంచి ‘కల్కి 2’ షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు కీలక పాత్రలపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్‌ సమయంలోనే సీక్వెల్‌కు సంబంధించి కొంత షూటింగ్ జరిగినట్లు తెలుస్తుంది.. ఇటీవల నిర్మాత అశ్వనీదత్‌ కూడా కల్కి సెకండ్ పార్ట్‌ 25 శాతం షూటింగ్‌ పూర్తయిందని తెలిపారు. కాబట్టి వచ్చే ఏడాదిలో కల్కి 2 ఖచ్చితంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం..

Related posts

గేమ్ ఛేంజర్ స్టోరీ లీక్ చేసిన శంకర్.. చరణ్ నటనకు ఫిదా..!!

murali

వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ?

filmybowl

జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!!

murali

Leave a Comment