MOVIE NEWS

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “గోదారి గట్టు మీద” ఫుల్ వీడియో సాంగ్..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన “సైంధవ్” సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో వెంకటేష్ తన ఫేవరేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.. ఆ సినిమానే “ సంక్రాంతికి వస్తున్నాం”.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. వెంకటేష్ అనిల్ రావిపూడితో గతంలో రెండు సినిమాలు చేయగా రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.. దీనితో “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించాడు.. ఈ సినిమా రిలీజ్ మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ లభించడంతో ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి..

ఓటీటీలో సైతం ‘గేమ్ ఛేంజర్’ కు నిరాశే మిగిలిందిగా..!!

సంక్రాంతికి వచ్చిన మరో రెండు భారీ సినిమాలైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంచలనం సృష్టించింది.. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ గా నటించగా వెంకీ భార్య గా ఐశ్వర్య రాజేష్, ప్రేయసిగా మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ మ్యూజిక్.. భీమ్స్ అందించిన మ్యూజిక్ ఎక్సట్రోర్డినరిగా ఉంటుంది.. ముఖ్యంగా గోదారి గట్టు సాంగ్ ని ప్రేక్షకులు రిపీట్ మోడ్ లో విన్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ మహాశివరాత్రికి ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..తాజాగా ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన “గోదారి గట్టు “ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది. ప్రస్తుతం ఇయూట్యూబ్ ని షేక్ చేస్తుంది..

 

Related posts

“మాస్ జాతర” గ్లింప్స్ అదిరిందిగా..వింటేజ్ రవితేజ కంబ్యాక్ గ్యారెంటీ..!!

murali

పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..?

murali

ప్రమోషన్స్ షురూ చేయనున్న పుష్పా

filmybowl

Leave a Comment