గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
ఇండియన్ 3 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!
గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో మేకర్స్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను USA లో జనవరి 4న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అమెరికా చేరుకున్నారు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ కూడా మేకర్స్ భారీ స్థాయిలో నిర్వహించనున్నారు.. గేమ్ ఛేంజర్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ లొకేషన్ వేటలో ఉన్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి లేదా వైజాగ్ లో ఈవెంట్ చేసేందుకు మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవరే స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్టు టాక్ వినిపిస్తోంది.పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గనుక వస్తే ఆ మూవీపై ఊహించని హైప్ వస్తుంది… అలాగే ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు..