గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. సంక్రాంతి కానుకగా జనవరి 10 న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది..
“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పాటలు, టీజర్ రిలీజ్ అయ్యాయి..టీజర్ ని గమనిస్తే రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో..మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. దానికి సంబంధించి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వస్తుంది..అయితే ఇవి కాకుండా సినిమాలో మరో సర్‌ప్రైజ్ లుక్ కూడా ఉంటుందని సమాచారం. అది సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు..
అయితే తాజాగా దీనికి సంబంధించి నిర్మాత దిల్ రాజు చిన్న లీక్ కూడా ఇచ్చారు.. రామ్‌చరణ్ 256 అడుగుల కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ వచ్చిన దిల్ రాజు సినిమా గురించి, అందులో రామ్ చరణ్ పాత్రల గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయం లీక్ చేశారు.రామ్ చరణ్ ఈ సినిమాలో స్టూడెంట్‌గా, ఐఏఎస్ ఆఫీసర్‌గా, రైతు నాయకుడు – రాజకీయ నాయకుడు అప్పన్న పాత్రలో కనిపిస్తాడని అందరూ ఊహించారు… అయితే వీటితో పాటు చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా కూడా కాసేపు కనిపిస్తాడని దిల్ రాజు చిన్న లీకిచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత రాంచరణ్ మరోసారి పోలీసుగా తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.