MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి..

ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, ఎస్. జె. సూర్య కీలక పాత్రలలో నటిస్తున్నారు.. మేకర్స్ ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్  చేస్తున్నారు.

ఈ సందర్బంగా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన స్టార్ యాక్టర్ శ్రీకాంత్ “గేమ్ ఛేంజర్” మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..ప్రస్తుతం ప్రేక్షకులు హీరో ఎలివేషన్స్‌ ఎంతగానో ఇష్టపడుతున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమాలో అలాంటి ఎలివేషన్స్ చెప్పలేనన్ని ఉన్నాయని శ్రీకాంత్ తెలిపారు.. అయితే ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఈ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి.

తన వైల్డ్ స్టోరీతో మెగాస్టార్ నే భయపెట్టిన సందీప్ వంగా..!!

శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.కార్తిక్ సుబ్బరాజ్ గారు మంచి రచయిత. ఆయన రాసిన కథ శంకర్ గారికి ఎంతగానో నచ్చింది. అందుకే సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. దిల్ రాజు గారు కూడా ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ మూవీకి సీక్వెల్ వంటివి ఏమీ ఉండవని శ్రీకాంత్ తెలిపారు.. ఈ సినిమాలో రాంచరణ్ నటనకి అందరూ ఫిదా అవుతారు.అలాగే సినిమాలో తన పాత్ర మరింత విభిన్నంగా ఉంటుందని శ్రీకాంత్ తెలిపారు

Related posts

కాంతార తో వార్ అయేటట్లుందే

filmybowl

గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!!

murali

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కి భారీ ఊరట..టికెట్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

Leave a Comment